తెలంగాణ
మరోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు స్పీడప్ అయింది. సిట్ ఎదుట బీఎస్పీ నేత వట్టే జానయ్య విచారణకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వట్టే జానయ్య సూర్యాపేట నుండి పోటీ చేశారు. ఆసమయంలో తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందని అందుకు సంబంధించిన ఆధారాలను సిట్ అధికారులకు సమర్పించారు.
అప్పటి బీఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేయించి వేధింపులకు పాల్పడినట్లు కంప్లయింట్ ఇచ్చారు. మరోవైపు కాసేపట్లో సిట్ ఎదుటకు SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరుకానున్నారు.