Anna Lezhneva: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ సతీమణి అన్నా లెజినోవా

Anna Lezhneva: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సతీమణి అన్నాలెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం శ్రీవారి తీర్థప్రసాదాలను అధికారులు అందజేశారు. అంతకుముందు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలి కారు.
తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్నిప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నాలెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆదివారం సాయంత్రమే ఆమె తిరుమలకు చేరుకున్నారు. స్థానిక గాయత్రీ నిలయంలో ఆమె బస చేశారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీభూవరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నా రు.
అనంతరం శ్రీపద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్యమతస్థురాలు కావడంతో మొదట అతిథిగృహంలో డిక్లరేషన్‌పై సంతకం చేశారు. అంతకుముందు తిరుమల విచ్చేసిన అన్నాలెజినోవా కొణిదెలకు జనసేన నేతలు, టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.
అన్నాలెజినోవా మతపరంగా క్రిస్టియన్ కావడంతో అన్యమతస్తులు తిరుమలకు వెళితే డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అన్నా లెజినోవా ఎటువంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాల పైన సంతకం చేశారు.
ఇక గతంలో పవన్ కళ్యాణ్ కుమార్తె పొలెనా అంజనా పవన్‌తో కలిసి తిరుమలకు వెళ్లారు. అప్పుడు కూడా ఆయన కుమార్తెతో డిక్లరేషన్ ఫామ్ పైన సంతకం చేయించారు.
అన్నాలెజినోవా మతపరంగా క్రిష్టియన్. అయినా అన్నాలెజినోవా పైగా రష్యాకి చెందిన మహిళ. అయితే తన మొక్కులతో భక్తిశ్రద్ధలు చూపించింది రష్యన్ మహిళ. సనాతన ధర్మం పాటిస్తూ తలనీలాలు ఇచ్చారు అన్నాలెజినోవా. దీంతో పవన్ సతీమణి అన్నాలెజినోవా పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గతంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన ఇద్దరు కూతుళ్లతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇందుకోసం పవన్ ఆద్యతోపాటు చిన్న కూతురు పలీనా అంజలి క్రిస్టియన్ కావడంతో తిరుమలలో డిక్లరేషన్ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఉద్యోగులు తీసుకువచ్చిన డిక్లరేషన్ పత్రాలపై పవన్ కూతురు సంతకం చేసింది. పలీనా అంజలి మైనర్ కావడంతో తండ్రిగా పవన్ కళ్యాణ్ కూడా అప్పట్లో డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు చేశారు.
