సినిమా
టాలీవుడ్లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె

టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె కొనసాగుతుంది. నాలుగో రోజు కూడా సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి. ఉదయం 11.30 గంటలకు కో ఆర్డినేషన్ కమిటీ మీటింగ్ జరగనుంది. నిర్మాతలు, ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు భేటీకానున్నారు. టాలీవుడ్ సంక్షోభానికి ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది. నిర్మాతలు కొన్ని రూల్స్ ప్రతిపాధించారు.
కాల్షీట్స్, గంటల లెక్క, నాన్ -మెంబర్స్, సండే సింగిల్ కాల్షీట్స్ విషయంలో కొత్త రూల్స్ చెప్పారు. నిర్మాతల రూల్స్ అర్ధం కాలేదన్న ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యులు తెలిపారు. కొత్త రూల్స్ మరోసారి వివరంగా చెబుతామన్న నిర్మాతలు వెల్లడించారు. నిర్మాతలు ఏం చెబుతారో విని డిసైడ్ అవుతామన్న ఫిల్మ్ ఫెడరేషన్ తెలిపింది.



