తెలంగాణ
Road Accident: లారీ బోల్తా పడి ఒకరు మృతి.. పలువురికి గాయాలు

Road Accident: ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ సమీపంలోని జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.



