సినిమా
Bigg Boss 9 Winner: బిగ్ బాస్ తెలుగు 9 విన్నర్‌గా కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల

Bigg Boss 9 Winner: బిగ్‌బాస్ తెలుగు 9వ సీజన్‌కు ముగింపు పలికింది. ముందు నుంచే అంచనాలు ఉన్నట్టుగానే కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాల ఈ సీజన్ విన్నర్‌గా నిలిచారు. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో చివరికి తనూజ, కళ్యాణ్ మాత్రమే మిగిలారు. ఈ సందర్భంగా హోస్ట్ నాగార్జున ఇద్దరికీ రూ.20 లక్షల ఆఫర్‌ను ప్రకటించగా, ఇద్దరూ దానిని తిరస్కరించారు. అనంతరం నాగార్జున వేదికపై విన్నర్‌ను ప్రకటిస్తూ కళ్యాణ్‌ను విజేతగా ప్రకటించారు. దీంతో తనూజ రన్నరప్‌గా నిలిచింది.



