సినిమా
రౌడీ జనార్దన్’లో విజయశాంతి?

విజయ్ దేవరకొండ ‘రౌడీ జనార్దన్’సింకమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి రవి కిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నాడు. సెకండ్ హాఫ్‌లో స్పెషల్ ఎపిసోడ్ హైలైట్ కానుందట. అందుకోసం విజయశాంతిని రంగంలో దింపుతున్నారు మేకర్స్.
విజయ్ దేవరకొండ హీరోగా రవి కిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్దన్’ తెరకెక్కుతోంది. సెకండ్ హాఫ్‌లో స్పెషల్ ఎపిసోడ్ ఉండనుంది. ఈ ఎపిసోడ్ కోసం దర్శకుడు ప్రత్యేక రోల్ రూపొందిస్తున్నాడు. ఈ రోల్‌కు సీనియర్ హీరోయిన్ విజయశాంతిని ఎంపిక చేయాలని టీమ్ భావిస్తోంది. ఈ వార్తతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇటీవల కెన్యా షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతోంది. స్టార్ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో విజయ్‌కు జోడీగా కీర్తి సురేశ్ నటిస్తోంది.



