తెలంగాణ

ఆశ్లీల వీడియోలు చూసి ఆఘాయిత్యం

అశ్లీల వీడియోలు చూపి ముగ్గురు బాలికలపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. బాధిత బాలికల్లో ఇద్దరు అక్కాచెల్లెలు కాగా మరో బాలిక స్థానిక స్కూలో 9వ తరగతి చదువుతోంది. తరగతి గదిలో పిల్లలు ఎలా పుడుతారనే విషయంపై బాలికలు మాట్లాడుకోవడం విన్న ఓ టీచర్ వారి తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో బాలికలను వారి తల్లిదండ్రులు నిలదీయగా అసలు విషయం బయటపడింది.

ఆగస్టు నెలలో ఇంటి ముందు ఆడుకుంటుండగా పొరుగున ఉండే ఇర్ఫాన్ అనే 36 ఏళ్ల వ్యక్తి చాక్లెట్ల ఆశ చూపి ముగ్గురు బాలికలకు అశ్లీల వీడియోలు చూపించి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. ఇలా పలు మార్లు జరిగిందని ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు బాలికలు చెప్పారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button