తెలంగాణ
Konda Surekha: నటుడు నాగార్జునకు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు

Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి క్షమాపణలు తెలిపారు. గతంలో తాను వారిపై చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ అర్థరాత్రి ట్వీట్ చేశారు. నాగార్జున కుటుంబాన్ని కించపరిచే ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యల వల్ల వారు బాధపడి ఉంటే చింతిస్తున్నానని ఆమె తెలిపారు.
గతంలో తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు కొండా సురేఖ తన ట్వీట్లో తెలిపారు. నాగచైతన్య, సమంత విడాకులపై చేసిన కామెంట్లతో వివాదం రాజుకుంది. అయితే అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత ఆమె ఈ ట్వీట్ చేయడం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.



