HIT 3: హిట్-3’ ట్రైలర్ ఎప్పుడంటే?

HIT 3: న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్-3’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. శైలేష్ కొలను డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి తాజాగా సెకండ్ సింగిల్ రిలీజైంది. ఈ సాంగ్‌తో పాటు ట్రైలర్ రిలీజ్ డేట్‌ను కూడా మేకర్స్ అనౌన్స్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం.
‘అబ్కీ బార్ అర్జున్ సర్కార్’ అంటూ సాగే ‘హిట్-3’ సెకండ్ సింగిల్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ పాటలో నాని రూత్‌లెస్ ఆఫీసర్ అర్జున్ సర్కార్‌గా నేరస్థులపై దయలేని యాక్షన్‌తో రెచ్చిపోతున్నాడు. ఈ సాంగ్ సినిమా స్లోగన్‌గా చెప్పబడుతూ అగ్రెసివ్ టోన్‌తో అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది.
లిరికల్ వీడియో చివర్లో ఏప్రిల్ 14న ట్రైలర్ రిలీజ్ అవుతుందని మేకర్స్ రివీల్ చేశారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తుండగా, మిక్కీ జే మేయర్ సంగీతం సినిమాకు మరో హైలైట్. మే 1న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. నాని ఫ్యాన్స్ ఇప్పటికే ఈ సాంగ్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు.