తెలంగాణ
Telangana Cabinet: ఈనెల 17న తెలంగాణ కేబినెట్ భేటీ

Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ భేటీ 17వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగనుంది. జూబ్లీహిల్స్ బై పోల్ తర్వాత జరగనున్న తొలి భేటీపై రాజకీయ వర్గాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. బైపోల్ విక్టరీపై సీఎం రేవంత్ ధీమాగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎన్నిక గెలిస్తే వెన్వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలపైనా ఫోకస్ పెట్టే అవకాశముందనే ఫీలర్లు వస్తున్నాయి.
కాంగ్రెస్ సర్కార్‌కు 42 శాతం బీసీ రిజర్వేషన్ల ఇష్యూ గుదిబండగా మారింది. బిల్లు చట్టరూపంలోకి రాకపోవడం, హైకోర్టు స్టే విధించడం, రెడ్డి సంఘాలు రిజర్వేషన్లు పెంచొద్దని కోర్టుల చుట్టూ తిరుగుతుండటం, ఎట్టి పరిస్థితుల్లో మా వాటా మాకే కావాలని బీసీలు అంటుండంతో రాజకీయం మొత్తం ఎన్నికల చుట్టూ తిరుగుతోంది.



