ఆంధ్ర ప్రదేశ్
రేపు జలశక్తి మంత్రి సమక్షంలో చంద్రబాబు, రేవంత్ భేటీ

బనకచర్లపై కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో.. రేపటి జలశక్తి మంత్రి సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీపై మరింత ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బనకచర్లపై చర్చించాలని ఏపీ ప్రభుత్వం సింగిల్ అజెండాగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఇచ్చిన బనకచర్ల అజెండాపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అంతేకాదు కేంద్రానికి లేఖ రాస్తూ బనకచర్లపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవని లేఖలో పేర్కొంది. చట్టాలు, ట్రిబ్యునల్ తీర్పులను ఉల్లంఘించే బనకచర్లపై చర్చించాల్సిన అవసరంలేదని రేవంత్ ప్రభుత్వం తెలియజేసింది.