సినిమా

టికెట్ ధరలపై ఎస్‌కేఎన్ ట్వీట్… నెటిజన్లు ఫైర్!

పైరసీకి పాల్పడిన ఐబొమ్మ రవి అరెస్టుతో టికెట్ ధరలపై మరోసారి చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో నిర్మాత ఎస్‌కేఎన్ ఒక థియేటర్ ధరలను పోస్టు చేశారు. దానికి నెటిజన్ల నుంచి కౌంటర్లు వస్తున్నాయి.

ఐబొమ్మ రవి అరెస్టుతో టికెట్ ధరలు, పైరసీపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరు రవిని సపోర్ట్ చేస్తూ టికెట్ ధరలు ఎక్కువ కాబట్టే పైరసీ జరుగుతోందని వాదిస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాత ఎస్‌కేఎన్ మూసపేట శ్రీరాములు థియేటర్ టికెట్, క్యాంటీన్ ధరల ఫొటోను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. టికెట్ ధర రూ.150 మాత్రమే కాగా, పాప్‌కార్న్ రూ.70, సమోసా రూ.30, కోక్ రూ.25, లేస్ ప్యాకెట్ రూ.18గా ఉన్నట్లు చూపించారు.

రామ్ పోతినేని నటించిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా విడుదలైంది. ఈ ధరలు చూస్తే సినిమాకు వెళ్లడం అంత ఖరీదైన వ్యవహారం కాదని ఎస్‌కేఎన్ సూచ్యంగా చెప్పినట్లయింది. అయితే నెటిజన్లు మాత్రం ఇది ఒకే ఒక్క థియేటర్ ధర మాత్రమేనని, పెద్ద మల్టీప్లెక్స్‌లలో ధరలు భారీగా ఉంటాయని కౌంటర్ ఇస్తున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో మరింత వేడెక్కింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button