ఆంధ్ర ప్రదేశ్

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్

Tirumala: తిరుమల శ్రీవారిని ఏపీ రెవిన్యూ శాఖామంత్రి అనగని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఉదయం విఐపి విరామ సమయంలో స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రాష్ట్రం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలని స్వామి వారిని కోరుకున్నట్టు తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని మొన్న అన్నదాత సుఖీభవ ఇవాళ చేనేత కార్మికులకు అలాగే నాయి బ్రాహ్మణులకు ఉచిత కరెంటు ఇస్తున్నట్టు రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button