తెలంగాణ
సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన కేసీఆర్

ఏపీ సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబుకు బర్త్ డే విషెష్ చెప్పారు గులాబీ బాస్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిరంతరం ప్రజా సేవకు అంకితమైన చంద్రబాబు జీవితం ఆయురారోగ్యాలతో, నిండు నూరేళ్లు సుఖశాంతులతో వర్ధిల్లాలీని కోరారు. ఇక ప్రజలకు మరింత సుభిక్షంగా పాలన అందించేందుకు చంద్రబాబుకు దేవుడు మరింత శక్తినివ్వాలన్నారు కేసీఆర్.