జాతియం
HMPV Virus: భారత్‌లో హెచ్ఎంపీవీ వైరస్ కలకలం.. ఇద్దరు చిన్నారులకు పాజిటివ్..

HMPV Virus: భారతలో రెండు హెచ్‌ఎమ్‌పీవీ కేసులు బయటపడ్డాయి. రెండు కేసులూ కర్ణాటక రాజధాని బెంగళూరులోనే వెలుగు చూసినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ICMR) తాజాగా ధృవీకరించింది. బెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి లో మూడు నెలల చిన్నారి, ఎనిమిది నెలల పాపకు ఈ వైరస్ సోకిటనట్లు తేలింది.
మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం శిశువు కోలుకుంటోందని పేర్కొంది. రోగులలో ఎవరికీ అంతర్జాతీయ ప్రయాణ చరిత్ర లేదని మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది.