War2: ఓటిటిలో వార్ 2 సందడి!

War2: బాలీవుడ్ యాక్షన్ చిత్రం వార్ 2 ఓటిటిలో సంచలనం సృష్టిస్తోంది. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఫ్యాన్స్ ఫుల్ ఫిదా అవుతున్నారు.
నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన వార్ 2 చిత్రం అభిమానులను ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ మల్టీస్టారర్ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా ఓటిటిలో ఎన్టీఆర్ డైనమిక్ యాక్షన్ సీక్వెన్స్‌లు, స్టైలిష్ పెర్ఫార్మెన్స్ ఫ్యాన్స్‌ను సంతోషపెడుతున్నాయి. బాలీవుడ్ హీరో హృతిక్ పాత్రకి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. దర్శకుడు అయాన్ ఈ ఇద్దరు స్టార్లను సమర్థవంతంగా ప్రెజెంట్ చేశారని ప్రశంసలు అందుకుంటున్నారు. భారీ బడ్జెట్‌తో నిర్మితమైన ఈ చిత్రానికి ప్రీతం అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హైలైట్‌గా నిలిచింది.
సోషల్ మీడియాలో ఫ్యాన్స్ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలను షేర్ చేస్తూ సంబరపడుతున్నారు. మొత్తానికి థియేటర్లో ప్లాప్ అయిన ఈ సినిమా ఓటిటిలో విడుదలైన తర్వాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. హీరోల కెమిస్ట్రీ, యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం ఓటిటి ప్రేక్షకులను ఆకర్షిస్తోంది.



