ఆంధ్ర ప్రదేశ్
Jakkampudi Raja: కూటమి ప్రభుత్వంపై మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా

Jakkampudi Raja: కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం సంక్రాంతికి కొత్త నిర్వచనం ఇచ్చిందని జక్కంపూడి రాజా సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఏపీలో నారా వారి నిర్వహణలో సంక్రాంతి సంబరాలు పేరిట రాష్ట్రంలో దోపిడీ జరిగిందన్నారు.
పేకాట, గుండాట, కోడి పందాలు, రికార్డింగ్ డ్యాన్స్, మద్యం అమ్మకాలు.. ఇదే కూటమి మేనిఫెస్టో అంటూ ఎద్దేవా చేశారు. సూపర్ సిక్సర్ పేరుతో చంద్రబాబు ప్రజలను వంచించారు. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా జూదాలు.. గుండాటలు జరిగాయని విమర్శించారు.