ఆంధ్ర ప్రదేశ్
Jagan: చంద్రబాబుకు వెన్నుపోటు పొడవడం అలవాటే

Jagan: ఉద్యోగులను చంద్రబాబు మోసం చేయటంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన హయాంలో అమలు చేసిన కార్యక్రమాలు, చంద్రబాబు మేనిఫెస్టోని చూపుతూ ఆయన ట్వీట్ చేశారు. ఉద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపారని అన్నారు.
ప్రజలపై, ఉద్యోగులపై చంద్రబాబుది కపట ప్రేమేనన్నారు. నమ్మించి వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకి అలవాటేనని అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ఒక్కటైనా నెరవేర్చారని అని జగన్ ప్రశ్నించారు.



