ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు గ్రీన్‌ సిగ్నల్‌..! త్వరలో టీడీపీ గూటికి మాజీ మంత్రి..!

ఆ మాజీమంత్రిని గత ఆరేళ్లుగా బ్యాడ్ టైం పట్టి పీడిస్తోందట. ఒకప్పుడు టీడీపీలో చక్రం తిప్పిన ఆ నేతకు ఇప్పుడు అదే పార్టీ డోర్స్ క్లోజ్ చేసిందట. మరోసారి పార్టీ వదిలిపోనూ మొర్రో అంటున్నా రీ ఎంట్రీకి మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదట. ప్రస్తుతం ఆ మాజీమంత్రి పరిస్ధితి ఉన్నది పాయే ఉంచుకున్నది పాయే అన్నట్లుగా మారిందట. దీంతో ఏడాది నుండి టీడీపీలో ప్లేస్‌మెంట్ దొరకక వెయిటింగ్ లిస్టులో వెయిట్ చేస్తున్నాడట. ఇప్పుడు ఆ మాజీమంత్రితో పాటు కుమారుడి పొలిటికల్ ఫ్యూచర్ కూడా డైలమాలో పడిందట.

ఇవన్నీ ఆ మాజీమంత్రి గురించి వినిపించిన పాత మాటలు. ప్రస్తుతం ఆయనకు కూడా గుడ్ టైం రాబోతోందట. వద్దన్న పార్టీయే అక్కున చేర్చుకునేందుకు సిద్ధమైందట. దీంతో తిరిగి సొంతగూటికి వెళ్లేందుకు ఆయన రెడీ అవుతున్నారట. ఇంతకు ఎవరా మాజీమంత్రి ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు. లెట్స్ వాచ్ దిస్ స్టోరీ.

మాజీమంత్రి శిద్దా రాఘవరావు పొలిటికల్ ఫ్యూచర్‌పై ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జోరుగా చర్చ సాగుతోంది. తెలుగుదేశంలో కీలకనేతగా అనేక పదవులు చేపట్టిన శిద్దా ఇప్పుడు ఏ పార్టీలో లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీకి గుడ్‌బై చెప్పిన శిద్దా రాఘవరావు.. అప్పటి నుండి వెయిటింగ్ లిస్టులోనే ఉండిపోయారు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కింగులా చక్రం తిప్పిన శిద్దా నేడు ఏం చేయాలో అర్ధం కాని డైలమాలో పడాల్సిన పరిస్ధితి ఏర్పడింది. అయితే ప్రస్తుతం శిద్దాకు మంచి రోజులు రాబోతున్నాయట.

నిన్న, మొన్నటి వరకు నో ఎంట్రీ బోర్డ్ పెట్టిన టీడీపీ అధిష్టానం పెద్దలు నేడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్దమయ్యారట. దీంతో సొంతగూటికి చేరి పోయిన తన వైభవాన్ని తిరిగి తెచ్చుకోవాలని శిద్దా భావిస్తున్నారట. ఎట్టకేలకు శిద్దా రీ ఎంట్రీకి పార్టీ పెద్దలు ఓకే చెప్పడంతో ఆయన అనుచరులతో పాటు అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోతున్నాయట.

బిజినెస్‌లతో బిజీబిజీగా ఉండే శిద్దా.. టీడీపీలో చేరగానే మొదటిసారి 2004లో ఒంగోలు అసెంబ్లీ నుండి సైకిల్ పార్టీ అభ్యర్ధిగా పోటీ చేశారు. అయితే.. ఆ ఎన్నికల్లో శిద్దా ఓటమి చెందడంతో పార్టీ ఛీఫ్ చంద్రబాబు.. శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారు. అనంతరం 2007లోనూ ఎమ్మెల్సీగా కొనసాగించారు. 2014లో మరోసారి దర్శి నియోజకవర్గ టీడీపీ సీటును శిద్దాకు కేటాయించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిపై శిద్దా విజయం సాధించారు. ఈ విజయంతో మురిసిపోతున్న శిద్దాకు బంపర్ లాటరీ తగిలినట్టు మంత్రి పదవి వరిచింది.

ఎమ్మెల్యేగా గెలిచింది మొదటిసారే అయినా చంద్రబాబు కేబినెట్‌లో కీలక శాఖలకు మంత్రి అయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలో జిల్లా టీడీపీకి తనే పెద్ద దిక్కుగా వ్యవహరించారు. ఇటు జిల్లాతో పాటు అటు రాష్ట్రంలోనూ కింగులా చక్రం తిప్పారు. ఇక 2019 ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ అధిష్టానం శిద్దాకు షాక్ ఇచ్చింది. దర్శి సీటు ఇవ్వకపోగా అసలు అసెంబ్లీ టికెటే కేటాయించలేదు. ఒంగోలు ఎంపీగా పోటీ చేయాలని పార్టీ పెద్దలు ఒత్తిడి తెచ్చారు. దీంతో తప్పని పరిస్ధితుల్లో శిద్దా కూడా సరే అనాల్సి వచ్చింది. ఎంపీగా పోటీ చేసిన శిద్దా రాఘవరావు అందరూ అనుకున్నట్టే ఆ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.

ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో శిద్దాకు కష్టాలు మొదలయ్యాయి. గ్రానైట్ వ్యాపారవేత్తగా ఉన్న శిద్దాను వైసీపీ సర్కార్ టార్గెట్ చేసింది. దీంతో చేసేదేమి లేని శిద్దా సైకిల్ దిగి, ఫ్యాను పంచన చేరారు. అయితే.. శిద్దాను పార్టీలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం అధికారంలో ఉన్న ఐదేళ్లు ఆయనను పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో ఆయన ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఒకప్పుడు జిల్లా టీడీపీలో తలలో నాలుకలా వ్యవహరించిన శిద్దాకు వైసీపీలో ఎటువంటి గుర్తింపు లేకుండా పోయింది.

2024 ఎన్నికల్లో దర్శి టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేసినప్పటికీ వైసీపీ అధిష్టానం నో బోర్డ్ చూపించింది. ఆ ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో ఆనందపడ్డ శిద్దా వైసీపీకి బైబై చెప్పి సైకిల్ ఎక్కాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే ఫ్యాను కండువాను పక్కన పడేసి పచ్చ కండువా పట్టుకున్నాడు. అయితే.. ఇక్కడే శిద్దాకు ఊహించని షాక్ తగిలింది. సొంత గూటికి రావాలనుకున్న శిద్దా ప్రయత్నాలకు.. తెలుగుదేశం పెద్దలు చెక్ పెట్టారు. దీంతో వైసీపీని వీడి ఏడాది గడిచినా ఏ పార్టీలో చేరుకుండా మిన్నకుండిపోయారు.

తన వారసుడు, యంగ్ బిజినెస్‌మెన్‌ శిద్దా సుధీర్‌ను రాజకీయాల్లోకి తేవాలనేది శిద్దా రాఘవరావు కోరిక. తను రాజకీయాల్లో ఉన్నప్పుడే ఇదంతా జరిగిపోవాలని అనుకున్నాడు. మంత్రిగా ఉన్న సమయంలో తను పోటీ చేసి గెలిచిన దర్శి నియోజకవర్గం అభివృద్ది కార్యక్రమాల్లో సుధీర్‌ను భాగం చేశాడు. దీంతో దర్శిలో ఏ కార్యక్రమం జరిగినా సుధీరే ఎక్కువగా పాల్గోనేవాడు. 2019 ఎన్నికల్లో తను ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు కూడా దర్శి అసెంబ్లీ సీటును కుమారుడు సుధీర్‌కు ఇప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు.

కానీ అప్పట్లో శిద్దా ప్రయత్నాలు ఫలించలేదు. 2014 నుండి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి.. నిత్యం ప్రజల్లో ఉన్న శిద్ధా కుటుంబం.. ప్రస్తుతం ఇంటికి పరిమితం కావాల్సిన పరిస్ధితులు ఏర్పడ్డాయి. దీంతో శిద్దా సుధీర్ రాజకీయ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకున్న పరిస్ధితి ఏర్పడింది.

టీడీపీలో కీలక గుర్తింపు ఉన్న శిద్దా రాఘవరావు.. తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరడమే ఇప్పటి వరకు ఆయన చేసిన బిగ్ మిస్టేకనే వాదన వినిపించింది. స్వయంగా తన రాజకీయ జీవితాన్ని తనే అంధకారంలోకి నెట్టుకున్నాడనే ప్రచారమూ జరిగింది. ఆయన చేసిన ఒక మిస్టేక్ ఆయనతో పాటు కుమారుడి రాజకీయ భవిష్యత్తును కూడా ప్రశ్నార్ధకంగా మార్చేసిందనే ప్రచారం జరిగింది.

అయితే మరికొద్ది రోజుల్లో ఈ ప్రచారాలకు ఫుల్‌స్టాప్ పడనున్నట్టు కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శిద్దా చేరికకు యస్ చెప్పారనే టాక్ వినిపిస్తోంది. శిద్దా కుటుంబం కూడా తన సన్నిహితులతో టీడీపీలో చేరనున్న విషయం చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఆగష్టు నెలలో శిద్దా రాఘవరావు బర్త్‌డే ఉండటంతో బర్త్‌డే‌కు ముందు టీడీపీ తీర్ధం తీసుకుంటారనే టాక్ వినిపిస్తోంది.

ఎప్పుడూ ప్రజల్లో ఉండే శిద్దా కుటుంబం గత కొంత కాలంగా యాక్టివ్ పాలిటిక్స్‌కు దూరంగా ఉండటం.. తన అభిమానులు, అనుచరుల్లో ఆందోళన కలిగిస్తోంది. అయితే త్వరలోనే పచ్చ కండువాతో శిద్దా కుటుంబం మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్ చేయనున్నారని తెలియడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శిద్దా కొడుకు పొలిటికల్ ఫ్యూచర్ కూడా గాడిన పడే అవకాశం కనబడుతోంది. అయితే టీడీపీలోకి తీసుకున్నాక.. వీరికి గతంలో ఉన్న ప్రాధాన్యత ఉంటుందా లేదా అనేది వేచి చూడాలి మరీ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button