ఆంధ్ర ప్రదేశ్
Raod Accident: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతి

Raod Accident: చెట్టును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, ఒకరు మృతిపార్వతీపురం సీతానగరంలో రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
మృతుడు కృష్ణాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. రాజమండ్రి నుండి పార్వతీపురం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



