Hit 3: ‘హిట్ 3’ యూఎస్‌లో సంచలనం..!

Hit 3: నాచురల్ స్టార్ నాని హీరోగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా రూపొందిన వైలెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ‘హిట్ 3’ సినిమా రిలీజ్‌కు ముందే సంచలనం సృష్టిస్తోంది. దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన ఈ చిత్రం యూఎస్ మార్కెట్‌లో ప్రీ-సేల్స్‌తో రికార్డులు బద్దలు కొడుతోంది. మే 1న పాన్ ఇండియా లెవెల్‌లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి!
శైలేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూడో చిత్రం ‘హిట్ 3’ రిలీజ్‌కు ముందే యూఎస్‌లో 3 లక్షల డాలర్ల ప్రీ-సేల్స్‌తో దూసుకెళ్తోంది. నాని సినిమాలకు యూఎస్ మార్కెట్‌లో ఉన్న క్రేజ్ మరోసారి రుజువైంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా, నాని స్వయంగా నిర్మాతగా వ్యవహరించారు. ప్రీమియర్స్ సహా డే 1 కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాలి. మే 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా నాని కెరీర్‌లో మరో బ్లాక్‌బస్టర్‌గా నిలిచే సూచనలు కనిపిస్తున్నాయి.