తెలంగాణ

Kaushik Reddy: బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి హౌస్ అరెస్ట్

Kaushik Reddy: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో.. బీఆర్ఎస్ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తన కమ్యూనిటీ ఏరియాలో జిమ్ చేసేందుకు వెళ్తున్న టైంలో పోలీసులు అతన్ని అడ్డగించి హౌస్ అరెస్ట్ చేశారు. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న పోలీసులు అతన్ని ఇంట్లో నుంచి బయటకు వెళ్లడానికి అనుమతిని నిరాకరించారు. దీంతో కౌశిక్ రెడ్డి వారితో వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది.

అలాగే… బీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి మేకల విద్యాసాగర్‌ను అర్ధరాత్రి అరెస్ట్ చేసి కొల్లూరు పోలీస్ స్టేషన్ స్టేషన్‌కు తరలించారు. దాదాపు 100 మంది బీఆర్ఎస్వీ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్‌లకు పోలీసులు తరలించారు. విచారణ పేరుతో అక్రమ అరెస్ట్‌లు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తీరుపై మండిపడుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button