తెలంగాణ
Miryalaguda: అగ్నిప్రమాదం.. టైర్ రీట్రేడింగ్ దుకాణంలో చెలరేగిన మంటలు

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అగ్నిప్రమాదం జరిగింది. టైర్ రీట్రేడింగ్ దుకాణంలో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. ప్రమాదంలో టైర్లు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మంటలు వ్యాపించడంతోపాటు దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికుల భయాందోళన చెందారు.
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.