అంతర్జాతీయం

హెయిర్ స్టైల్ మార్చేసిన ట్రంప్.. హీరోలా ఉన్నారంటున్న నెటిజన్లు.. మీరేమంటారు?

Donald Trump New Hair Style: ఇటీవలే జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. 2025 జనవరి నెలలో అమెరికా అధ్యక్ష పదవిలోకి వచ్చి దేశాన్ని ఏలబోతున్న ఈయన తాజాగా సరికొత్త హెయిర్ స్టైల్‌తో దర్శనం ఇచ్చారు. వైట్ టీ షర్టు, బ్లాక్ ప్యాంటులో కనిపించడంతో పాటు న్యూ హెయిర్ స్టైల్‌లో.. మరింత అందంగా కనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ వీడియోలో ట్రంప్ ఎలా ఉన్నారంటే?

ట్రంప్ హెయిర్ స్టైల్ మార్చారంటూ చెబుతున్న వైరల్ వీడియోలో.. ఆయన చాలా అందంగా కనిపిస్తున్నారు. తెలుపు రంగు టీషర్టుతో పాటు నల్లని ప్యాంటు వేసుకున్న ఆయన వైట్ కలర్ షూస్ ధరించారు. అయితే ఆయన ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ ఇంటర్నేషనల్ గోల్డ్ క్లబ్‌లో తన ప్రైవేటు ప్రాపర్టీ వద్దకు వచ్చారు. ఈక్రమంలోనే ఆయనను చూసిన అమెరికన్లు గట్టిగా కేకలు వేశారు. ట్రంప్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఇదంతా ఇలా ఉండగా.. ఈ వీడియోలో ఆయన హెయిర్ స్టైల్ మారిపోయినట్లు తెలుస్తుంది.

ట్రంప్ ప్రమాణ స్వీకారం ఆరోజే..!

2025 జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్.. అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అదే రోజున పదవీ బాధ్యతలు చేపట్టబోతున్నారు. 2024లో జరిగిన అమెరికా ఎన్నికల్లో ఆయన 295 ఎలక్టోరల్ ఓట్లు సాధించి… 226 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన కమలా హారిస్‌పై విజయం సాధించారు. 78 ఏళ్ల వయసులో దేశాధ్యక్ష పదివికి ఎన్నికై రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఈ వయసు వారెవరూ అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించలేరు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button