సినిమా

అఖండ 2లో ప్రవచనకర్త స్పెషల్ సాంగ్..!

Akhanda 2: బాలయ్య బోయపాటి కాంబో మళ్లీ సందడి చేస్తోంది. అఖండ 2 కోసం ప్రముఖ ప్రవచనకర్త పాట పాడారు. గీతా శ్లోకాలు రికార్డ్ చేశారు. సనాతన ధర్మం థీమ్ హైలైట్ అవుతోంది. టీం ఆయన దగ్గర ఆశీర్వాదాలు అందుకున్నారు.

సింహా, లెజెండ్, అఖండ తర్వాత బోయపాటి శ్రీను బాలకృష్ణతో అఖండ 2 తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో కీలక సన్నివేశం కోసం ఎల్ వి గంగాధర శాస్త్రి భగవద్గీత నుంచి రెండు శ్లోకాలు పాడారు. తమన్ రికార్డింగ్ థియేటర్‌లో గురు భావంతో ఆయన్ని ఆహ్వానించారు. ఆయనకు బోయపాటి సన్నివేశాలను వివరించి, చిత్రం సనాతన ధర్మానికి అంకితమని భావోద్వేగంగా చెప్పారు.

గంగాధర శాస్త్రి తమన్ రీ-రికార్డింగ్‌ను ప్రశంసించారు. ఈ సినిమాతో సనాతన ధర్మం పవర్ చూపిస్తామని బోయపాటి అన్నారు. గంగాధర శాస్త్రి బోయపాటి, తమన్‌లను ఆశీర్వదించి తులసి మాల, భగవద్గీత బహూకరించారు. చిత్రం విజయవంతం కావాలని కోరారు. భగవద్గీత ఫౌండేషన్ ఎక్స్‌లో ఈ విషయం గురించి ట్వీట్ చేసింది. ఈ సినిమాలో మాస్ యాక్షన్‌తో పాటు ఆధ్యాత్మిక థీమ్ హైలైట్ అవుతోంది. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button