ఆంధ్ర ప్రదేశ్
Chandrababu: జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలి

Chandrababu: అమరావతిలోని ఏపీ సచివాలయంలో ప్రపంచ జనాభా దినోత్సవ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. జనాభా నియంత్రణ కాదు.. నిర్వహణ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జనాభా అనేది భారం కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చిందని వ్యాఖ్యానించారు.
భారతదేశంలో ఎక్కువ జనాభా ఉండటం మనకు పెద్ద వనరని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా యువశక్తి క్షీణించి అభివృద్ధి కూడా తగ్గిపోతోందన్నారు. ఆర్థిక సంస్కరణలు అందిపుచ్చుకున్న తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారని తెలిపారు. దేశమంటే మనుషులు అనే నినాదానికి సార్ధకత చేకూరాలని సీఎం అన్నారు. గురజాడ చెప్పిన స్ఫూర్తితో ముందుకెళ్లాలని సూచించారు.