సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు

Tirumala: కలియుగ ప్రత్యేక్ష దైవం తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రముఖ నటుడు మోహన్ బాబు కుటుంబం, హీరోయిన్ డింపుల్ హయాతి, రచయిత చంద్రబోస్, టేబుల్ టెన్సిస్ ప్లేయర్ నైనా జైస్వాల్, తమిళ హీరో అరుణ్ విజయ్ వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు వేదఆశీర్వచనం అందించి, స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.



