శిల్పా-రాజ్ కుంద్రాకు హైకోర్టు షాక్.. 60 కోట్లు డిపాజిట్ చేయాల్సిందే!

బాలీవుడ్ నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాపై 60 కోట్ల మోసం కేసు నడుస్తోంది. విదేశాలకు వెళ్లేందుకు లుకౌట్ నోటీసు ఎత్తివేయాలని కోరారు. కానీ బాంబే హైకోర్టు షాకిచ్చింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
శిల్పా శెట్టి-రాజ్ కుంద్రా దంపతులపై 60 కోట్ల మోసం ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. వ్యాపార భాగస్వామి దీపక్ కొఠారి ఫిర్యాదు మేరకు ఈడీ కేసు పెట్టింది. తమపై ఉన్న లుకౌట్ సర్క్యులర్ ఎత్తివేయాలని దంపతులు బాంబే హైకోర్టును ఆశ్రయించారు. అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూడడానికి లండన్ వెళ్లాల్సి ఉందని, జనవరి 20, 2026కి ముందు ప్రయాణం అవసరమని పిటిషన్‌లో పేర్కొన్నారు. తండ్రికి తీవ్రమైన ఐరన్-అమ్మోనియా లోపం ఉందని, శ్వాస సమస్యలు వస్తున్నాయని వైద్య రిపోర్టులు సమర్పించారు.
కేసు కేవలం సివిల్ మాత్రమేనని, క్రిమినల్ కాదని వారి న్యాయవాది అబాద్ పోండా వాదించారు. అయినా బాంబే హైకోర్టు కఠినంగా స్పందించింది. లుకౌట్ ఎత్తివేయాలంటే 60 కోట్లు డిపాజిట్ చేయాలని లేదా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మొత్తం చెల్లించకపోతే లుకౌట్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది.



