అంతర్జాతీయం
అమెరికాలో వరుస విమాన ప్రమాదలు.. మరోసారి రెండు విమానాలు ఢీ

అమెరికాలో వరుస విమాన ప్రమాదాలు కలకలం సృష్టిస్తున్నాయి. మరోసారి రెండు విమానాలు ఢీకొన్నాయి. ఆరిజోనాలోని స్కాట్స్డేల్ విమానాశ్రయంలో రెండు ప్రైవేట్ జెట్లు ఢీకొన్నాయి. రన్ వే 21పై బాంబార్డియర్ లియర్ జెట్ 35A ల్యాండ్ అవుతుండగా.. అదుపుతప్పి మరో ఎయిర్ జెట్ గల్ఫ్ స్ట్రీమ్ G200ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. దీంతో ఎయిర్పోర్టులో విమానాలను తాత్కాలికంగా నిలిపివేశారు.