ఆంధ్ర ప్రదేశ్
నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఆమోదం

Chandrababu: నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు మంత్రివర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. 50వ సీఆర్డీయే నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. పలు సంస్థలకు భూకేటాయింపులకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. నాలా చట్టం రద్దు అంశం కేబినెట్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు.