తెలంగాణ
Madhavaram: కేసీఆర్ కుటుంబంపై బురద చల్లడమే రేవంత్ లక్ష్యం

Madhavaram: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కుటుంబంపై బురద చల్లడం తప్పుడు కేసులు పెట్టడమే రేవంత్ రెడ్డి టార్గెట్ అని ధ్వజమెత్తారు. అహర్నిషలు కష్టపడి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంచానికి చాటిచెప్పింది కేటీఆర్ అన్నారు. అభివృద్ధి చేయడం మానేసి ఆరోపణలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదన్నారు.
సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. అందుకు నిదర్శనమే బీజేపీ కాంగ్రెస్ కొట్లాట అన్నారు. పోలీసుల సమక్షంలోనే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు దాడులు చేసుకోవడమేంటని ధ్వజమెత్తారు. రేవంత్ ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ భయపడదన్నారు. కేటీఆర్ ఏసీబీ, ఈడీ విచారణకు హాజరవుతారని ఎమ్మల్యే మాధవరం కృష్ణారావు నొక్కిచెప్పారు.