తెలంగాణ

Osmania University: ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్తత

Osmania University: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే వరకు అన్ని పోటీ పరీక్షల ఫలితాలను వాయిదా వేయాలని మాదిగ విధ్యార్థి ఫెడరేషన్ నాయకులు అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రూప్ ఫలితాలను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ లేకుండా ప్రభుత్వం గ్రూప్ ఫలితాలను విడుదల చేయడం సిగ్గుచేటన్నారు.

కాగా రిలే నిరాహార దీక్షను ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు భగ్నం చేశారు. అనంతరం ఎంఎస్ఎఫ్ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టులను ఖండిస్తూ ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో దిష్టిబొమ్మ దహనం చేసిన ఎంఎస్ఎఫ్ నాయకులను కూడా ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button