Andhra King Taluka: ఆకట్టుకున్న ఆంధ్రా కింగ్ తాలూకా!

Andhra King Taluka: రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. మహేశ్ బాబు.పి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్గా నటించారు. కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర కీలకపాత్ర పోషించారు. కాగా ఈ సినిమా నేడు థియేటర్లలో విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాలో రామ్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. కామెడీ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషన్స్ తోనూ రామ్ మెప్పించాడు. హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సే మెప్పించింది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకుంది. కీలక పాత్రలో నటించిన ఉపేంద్ర మెప్పించాడు. ఉపేంద్ర – రామ్ మధ్య వచ్చే సన్నివేశం బాగుంది. ఇక తండ్రి పాత్రలో నటించిన రావు రమేష్ కూడా బాగా నటించాడు.
మురళీశర్మ, రాహుల్ రామకృష్ణ, తులసి, సింధు, సత్య, విటీవీ గణేష్ అలాగే మిగిలిన నటీనటులు కూడా బాగా నటించారు.దర్శకుడు మహేష్ బాబు.పి రాసుకున్న మెయిన్ థీమ్, ఎమోషనల్ ఎపిసోడ్స్, కొన్ని ఫ్యామిలీ సీన్స్ బాగున్నాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ కి ఫ్యాన్స్ కి మధ్య ఉండే బాండింగ్ చాలా బాగుంది. రామ్ అభిమానులను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని చాలా బాగా తెరకెక్కించాడు.



