ఆంధ్ర ప్రదేశ్
Tirupati: బాల్య వివాహం అడ్డుకున్న అధికారులు

Tirupati: అధికారులు బాల్య వివాహం అడ్డుకున్న ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఐతేపల్లిలో వెలుగులోకి వచ్చింది. సర్పంజ్ ఫజిలా చొరవతో బాలికకు విముక్తి కల్గింది. పక్కా సమాచారంతో స్థానిక సెక్రటరీ, ఐసీడీఎస్, మహిళా పోలీస్ సచివాలయ సిబ్బందితో కలిసి పెళ్లి జరుగుతున్న నివాసానికి వెళ్లారు. అక్కడ పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరూ మైనర్లని గుర్తించారు.
దీంతో పెళ్లి వేడుకను అడ్డుకున్నారు. అదేవిధంగా పెళ్లి ఇష్టం లేదని చెప్పినా, తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారని బాలిక చెప్పడంతో పేరెంట్స్ తీరుపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇచ్చారు ఐసీడీఎస్ అధికారులు. తిరుపతి జిల్లా ఐతేపల్లిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.