ఆంధ్ర ప్రదేశ్
Borugadda: జైలులో లొంగిపోయిన బోరుగడ్డ అనిల్

Borugadda: రౌడీషీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్కు 14రోజుల రిమాండ్ విధించారు గుంటూరు జడ్జి. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ వారి కుటుంబ సభ్యులను దూషించిన కేసులో అరెస్టై మధ్యంతర బెయిలుపై ఉన్న వైసీపీ నేత, రౌడీషీటర్ బోరుగడ్డ ఇవాళ ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయాడు.
అనంతరం అక్కడి నుంచి గుంటూరు జడ్జి ముందుకు బోరుగడ్డను హాజరుపర్చారు. ఈ నేపథ్యంలోనే బోరుగడ్డ రిమాండ్ విధించారు. అనంతరం జగ్గయ్యపేట సబ్ జైలుకు తరలించనున్నారు పోలీసులు.