తెలంగాణ

Bomb Threat: హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ స్కూల్‌కు బాంబు బెదిరింపు

Bomb Threat: హైదరాబాద్ బొల్లారంలోని ఆర్మీ స్కూల్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు విద్యార్థులను ఇంటికి పంపించి ఆర్మీ, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఆర్మీ స్కూల్‌కు దుండగులు మెయిల్ ద్వారా మెసేజ్ పంపారు. ఇతర ఆర్మీ స్కూళ్లకు కూడా మెయిల్ పంపినట్టు అధికారులు గుర్తించారు. నిన్న నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌కు బాంబు బెదిరింపు వచ్చింది.

స్కూల్‌కు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.స్కూల్‌కు బాంబు బెదిరింపు రావడంతో యాజమాన్యం విద్యార్థులను వెంటనే బయటకు పంపించింది. డాగ్ స్క్వాడ్ వచ్చి క్లాస్ రూంలతో పాటు స్కూల్ ప్రాంతాన్ని మొత్తం తనిఖీ చేసింది. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమానిత వస్తువులు లభించలేదు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button