తెలంగాణ
కొడంగల్ ఇళ్ల కూల్చివేతలపై హరీశ్‌రావు ట్వీట్

కొడంగల్‌లో ఇళ్ల కూల్చివేతల అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. మద్దూరులో పేదల ఇళ్లను నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఏళ్లుగా నివాసం ఉంటున్న కుటుంబాలను ఒక్కసారిగా రోడ్డున పడేయడం సరికాదని హరీశ్‌రావు ప్రశ్నించారు. బాధితులకు భూసేకరణ చట్టం-2013 ప్రకారం న్యాయమైన పరిహారం, పునరావాసం కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.


