డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌కు స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. విశాఖపట్నంలోని సిరిపురం నుండి పెద్ద వాల్తేరు వైపు వెళ్తుండగా, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ సమీపంలో కాన్వాయ్‌లోని ఒక వాహనం ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేసింది. దీంతో వెనుక వస్తున్న కాన్వాయ్‌లోని చివరి వాహనం దానిని బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో వాహనం ముందు భాగం స్వల్పంగా దెబ్బతిన్నప్పటికీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు, భద్రతా సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదం జరిగిన సమయంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్‌లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆయనను పికప్ చేసుకోవడానికి రాడిసన్ బ్లూ హోటల్‌కు కాన్వాయ్ వెళ్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మధ్యాహ్నం జరగబోయే అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు పవన్ విశాఖకు వచ్చారు.



