సినిమా

సూర్యకుమార్‌తో లింకప్ పై హీరోయిన్ క్లారిటీ?

Khushi Mukherje: టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్‌ ప్రేమాయణం పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ చేసిన కామెంట్లు ఈ చర్చకు కారణమయ్యాయి. అయితే ఈ వివాదంపై ఖుషీ స్వయంగా స్పందించి స్పష్టత ఇచ్చారు. వీరిద్దరి మధ్య సంబంధం ఏమిటో ఆమె వెల్లడించారు. దీని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ఇటీవల సోషల్ మీడియాలో సూర్యకుమార్ యాదవ్ తరచూ తనకు మెసేజ్‌లు చేశాడని ఖుషీ ముఖర్జీ ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో పుకార్లు మొదలయ్యాయి. చాలామంది క్రికెటర్లు తన వెనక పడ్డారని, అందులో సూర్యకుమార్ కూడా ఉన్నాడని ఆమె అన్న మాటలు హల్చల్ సృష్టించాయి.

దీంతో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సంబంధం ఉందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే తాజాగా ఖుషీ ముఖర్జీ ఈ పుకార్లను ఖండించారు. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, సూర్యకుమార్‌తో తనకు ఎలాంటి ప్రేమ సంబంధం లేదని స్పష్టం చేశారు.

కేవలం మంచి స్నేహితులమే అని తెలిపారు. ఒకసారి మ్యాచ్ ఓడిపోయి బాధపడుతున్న సూర్యకుమార్ స్నేహితుడిలా చాట్ చేశాడని, అందులో వేరే ఉద్దేశం లేదని వివరించారు. సూర్యకుమార్ పెళ్లయిన వ్యక్తి అని, భార్యతో సంతోషంగా ఉన్నాడని, వారి పర్సనల్ లైఫ్‌కు గౌరవముందని చెప్పారు.

అనవసర పుకార్లు సృష్టించవద్దని కోరారు. పాత చాట్స్ చూసి తప్పుగా అనుకుంటున్నారని, అందులో తప్పు ఏమీ లేదని వెల్లడించారు. ఆయన తన రీల్స్‌ను లైక్ చేసేవాడని, ఫ్రెండ్లీగా మెసేజ్ చేసేవాడని, అంతకుమించి ఏమీ లేదని చెప్పి వివాదానికి తెర దించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button