తెలంగాణ
Jagga Reddy: క్యాన్సర్ బాధితులకు జగ్గారెడ్డి ఆర్థిక సహాయం

Jagga Reddy: సంగారెడ్డి జిల్లాలో క్యాన్సర్ బారిన పడిన నిరుపేదలకు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అండగా నిలిచారు. క్యాన్సర్ బారిన పడిన ఆరుగురికి చికిత్స నిమిత్తం గతంలో 2 లక్షలు ఆర్థిక సహాయం చేసిన జగ్గారెడ్డి తాజాగా బాధితులకు తక్షణ సహాయం కింది ఒక్కరికి 2 లక్షల చొప్పున అందించారు. గుట్కా, సిగరెట్ తాగడం వంటి దురలవాట్ల కారణంగా క్యాన్సర్ బారిన పడి మీ కుటుంబాలకు అన్యాయం చేయొద్దని జగ్గారెడ్డి కోరారు. దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంగా జీవించాలని ప్రజలకు సూచించారు.



