తెలంగాణ
మంత్రి పొంగులేటి స్వగ్రామంలో ఏకగ్రీవం

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా కల్లూరు మండలం నారాయణపురంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థులకు మంత్రి సోదరుడు, బీజేపీ నాయకుడు పొంగులేటి ప్రసాదరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆశీస్సులతో గ్రామ పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు గ్రామ సర్పంచ్ గొల్లమందల వెంకటేశ్వర్లు.



