తెలంగాణ
Jubilee Hills By Election: నవీన్ యాదవ్ ఘన విజయం.. సంబరాల్లో కాంగ్రెస్ శ్రేణులు

Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపుతో బాణసంచా కాల్చి, మిఠాయిలు పంచుతూ వేడుకలు జరుపుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే జూబ్లీహిల్స్ విజయానికి దొహదపడ్డాయని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజల సంపూర్ణ మద్దతుతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరిన్ని విజయాలు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.



