సినిమా

Ravi Teja: రవితేజకు నో రెమ్యునరేషన్?

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాప్‌ల నేపథ్యంలో కొత్త సినిమాకు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. భర్త మహాశయులకు విజ్ఞప్తి టైటిల్‌తో ప్రకటించిన ఈ చిత్రానికి కిశోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. రెమ్యునరేషన్ తీసుకోకుండా నటిస్తున్నట్లు టాక్.

రవితేజ ఇటీవలి సినిమాలు ధమాకా తర్వాత పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. మాస్ జాతర కూడా నిరాశ పరిచింది. మాస్ ఇమేజ్ ఉన్నప్పటికీ ఫలితాలు రాకపోవడంతో అభిమానులు కలవరపడ్డారు. ఈ నేపథ్యంలో సడన్‌గా భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. కిశోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫ్యామిలీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. వరుస ఫ్లాప్‌లు ఎదుర్కొంటున్న సమయంలో రవితేజ రెమ్యునరేషన్ లేకుండా నటిస్తున్నట్లు టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.

నిర్మాతలపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సినిమా సక్సెస్ అయితే పర్సంటేజ్ రూపంలో తీసుకుంటారని మరో టాక్. నిర్మాతలు నష్టపోకూడదన్న రవితేజ ఆలోచనకు నెటిజన్స్ ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. రవితేజ వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఈ చిత్రం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా నిలుస్తుంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button