తెలంగాణ
తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణస్వీకారం

Mohammad Azharuddin: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మహ్మద్ అజారుద్దీన్ తెలంగాణ రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనకు ప్రమాణ స్వీకారం చేయించారు. అల్లా పేరుతో అజారుద్దీన్ ప్రమాణం చేశారు.
ఈ వేడుకలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.



