సినిమా

Sachin Sanghvi: థామా మ్యూజిక్ డైరెక్టర్ అరెస్టు!

Sachin Sanghvi: ‘థామా’, ‘స్త్రీ 2’ చిత్రాల సంగీత దర్శకుడు సచిన్ సంఘ్వీపై ఓ యువతి లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ ఆరోపణలు నిరాధారమని న్యాయవాది చెప్పారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

రష్మిక ‘థామా’, శ్రద్ధా కపూర్ ‘స్త్రీ 2’ వంటి హిట్ చిత్రాలకు సంగీతం అందించిన సచిన్ సంఘ్వీపై ఓ యువతి సంచలన ఆరోపణలు చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఫిర్యాదు దాఖలైంది. పోలీసులు విచారణ అనంతరం సచిన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 2024లో ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సంప్రదించిన సచిన్, మ్యూజిక్ ఆల్బమ్‌లో అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగికంగా వేధించాడని యువతి ఆరోపించింది.

స్టూడియోకి పిలిచి అక్కడ వేధించాడని, చాలాసార్లు వాడుకుని మోసం చేశాడని చెప్పింది. సచిన్ న్యాయవాది ఆరోపణలు నిరాధారమని, ఎఫ్‌ఐఆర్ చట్టవిరుద్ధమని తెలిపారు. అరెస్టు తప్పని, వెంటనే బెయిల్ ఇచ్చారని చెప్పారు. సచిన్-జిగర్ ద్వయం బాలీవుడ్‌లో ప్రముఖులు. ‘స్త్రీ 2’, ‘బేడియా’, ‘థామా’, ‘పరం సుందరి’లకు సూపర్ హిట్ పాటలు ఇచ్చారు. మొదట టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రీతమ్ దగ్గర సహాయకుడిగా పనిచేసిన సచిన్, తర్వాత జిగర్‌తో కలిసి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button