సినిమా

SIDPA: రాజేష్ దండా వ్యాఖ్యలపై SIDPA ఫైర్!

SIDPA : K ర్యాంప్ నిర్మాత రాజేష్ దండా తన సినిమాపై నెగటివిటీ పెంచుతున్న వెబ్‌సైట్‌పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అయితే సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ ఆయన వ్యాఖ్యలను ఖండించింది. ఓ లేఖని కూడా రిలీజ్ చేసింది. దాని గురించి పూర్తి వివరాలు చూద్దాం.

K ర్యాంప్ సినిమా సక్సెస్ మీట్‌లో నిర్మాత రాజేష్ దండా తన సినిమాపై నెగటివిటీ పెంచుతున్న వెబ్‌సైట్‌పై వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కాగా, సౌత్ ఇండియా డిజిటల్ పబ్లిషర్స్ అసోసియేషన్ (SIDPA) వీటిని తీవ్రంగా ఖండించింది. ఓ లేఖ రిలీజ్ చేసిన SIDPA, ప్రొఫెషనల్ డిఫరెన్సెస్‌ను గౌరవంగా వెల్లడించాలని, పబ్లిక్‌గా అవమానకరంగా మాట్లాడటం ఆమోదయోగ్యం కాదని పేర్కొంది.

హాని కలిగించేలా, భయపెట్టేలా మాట్లాడటం క్రిమినల్ అఫెన్స్ అవుతుందని హెచ్చరించింది. మీడియా హౌస్‌లు, జర్నలిస్టులను అవమానించే వ్యాఖ్యలను సహించమని, పత్రికా స్వేచ్ఛ కోసం ఎంత దూరమైనా వెళ్తామని తెలిపింది. రాజేష్ దండా ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా తన వెర్షన్ ని వినిపించారు. అయినా కానీ ఈ వివాదం సినీ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఈ గొడవ చివరకు ఎటు వైపు వెళుతుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button