సినిమా

క్లైమాక్స్ కి చేరిన అఖండ 2!

Akhanda 2: బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న ‘అఖండ 2’ ఉత్కంఠ రేపుతుంది. క్లైమాక్స్ బ్యాలెన్స్ షూట్‌కు సన్నాహాలు జరుగుతున్నాయి. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. పూర్తి వివరాలు చూద్దాం.

‘అఖండ’ సక్సెస్ తర్వాత ‘అఖండ 2 – తాండవం’ పై రెట్టింపు అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో సంయుక్త కథానాయికగా కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రస్తుతం క్లైమాక్స్ బ్యాలెన్స్ షూట్‌ను పూర్తి చేయడానికి టీమ్ సిద్ధమవుతోంది. సీజీ, విఎఫ్‌ఎక్స్ వర్క్ శరవేగంగా సాగుతోంది. తమన్ సంగీతం అందించి, సినిమాకు మరింత ఆకర్షణ కలిగిస్తున్నారు.

2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ ఖాయమైంది. టీజర్ తో సూపర్ ట్రెండ్ సృష్టించిన ఈ చిత్రం అభిమానులను ఎంతగానో ఉర్రూతలూగిస్తుంది. ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. బాలయ్య ఈ సినిమాతో మరో మాస్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button