సినిమా

రాజాసాబ్ రిలీజ్ డేట్, సీక్వెల్‌పై నిర్మాత సంచలన కామెంట్స్!

The raja saab: ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాజాసాబ్’ సినిమా రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొంది. నిర్మాత విశ్వప్రసాద్ తాజాగా కీలక విషయాలు వెల్లడించారు. సినిమా రిలీజ్ ఎప్పుడు? సీక్వెల్ గురించి ఏమన్నారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం!

‘రాజాసాబ్’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సంజయ్ దత్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ హారర్, రొమాంటిక్, కామెడీ చిత్రం VFXలో రాజీ లేకుండా రూపొందుతోంది. నిర్మాత విశ్వప్రసాద్ తాజా ఇంటర్వ్యూలో, సినిమా అక్టోబర్ నాటికి సిద్ధమవుతుందని, డిసెంబర్ 5 లేదా 6న విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు.

తెలుగు బయ్యర్స్ జనవరి 9న, హిందీ బయ్యర్స్ డిసెంబర్ 5న రిలీజ్ కోరుకుంటున్నారు. సాంగ్స్ షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. అలాగే, ‘రాజాసాబ్’కు సీక్వెల్ ఉంటుందని, అది మల్టీవర్స్ తరహాలో కొత్త కథతో రూపొందుతుందని నిర్మాత స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button