సినిమా

Dil Raju: యూట్యూబ్ ఫేక్ వ్యూస్ కొనడం ఇకపై ఆపేస్తా

Dil Raju: ప్రముఖ నిర్మాత FDC ఛైర్మన్, దిల్‌రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సినిమాల ప్రచారంలో యూట్యూబ్ వ్యూస్‌ను కృత్రిమంగా పెంచుకునే పద్ధతిపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇకపై తమ బ్యానర్‌లో నిర్మించే సినిమాలకు డబ్బులు ఇచ్చి ఫేక్ యూట్యూబ్ వ్యూస్‌ను కొనేది లేదని ఆయన స్పష్టం చేశారు. నితిన్ హీరోగా నటిస్తున్న “తమ్ముడు” సినిమా నుంచే ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తున్నట్లు దిల్‌రాజు ప్రకటించారు.

సినిమా ట్రైలర్ లేదా పాట ఎంత మందికి వాస్తవంగా చేరుతుందో తెలుసుకోవాలనేది తన ఉద్దేశమన్నారు దిల్‌రాజు. లక్షలు, కోట్లు ఖర్చు పెట్టి వ్యూస్ కొంటే అక్కడ నెంబర్ కనిపిస్తుంది కానీ, అది నిజమైన ప్రేక్షకాదరణ కాదన్నారు ఆయన. కంటెంట్ ప్రేక్షకులకు ఎంతవరకు రీచ్ అయిందో అర్థం కావట్లేదన్నారు. అందుకే తన పీఆర్ టీమ్‌కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button