సినిమా

Akhanda 2: రికార్డులు తిరగరాసిన ‘అఖండ 2’ టీజర్‌!

Akhanda 2: నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2 – తాండవం’ టీజర్‌తో సంచలనం సృష్టించాడు. ఈ టీజర్ 24 గంటల్లో రికార్డులు తిరగరాసింది. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ సెప్టెంబర్ 25న దసరా కానుకగా విడుదల కానుంది.

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2 – తాండవం’ టీజర్ అభిమానుల్లో జోష్ నింపింది. బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ టీజర్, ఒక్క రోజులోనే 24 మిలియన్ వ్యూస్, 540K లైకులతో టాలీవుడ్ టాప్-5 టీజర్‌లలో చోటు దక్కించుకుంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య మరోసారి మాస్ అవతారంలో దర్శనమివ్వనున్నాడు.

థమన్ సంగీతం సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తోంది. ఆది పినిశెట్టి విలన్‌గా కనిపించనుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రం సెప్టెంబర్ 25న దసరా సందర్భంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. బాలయ్య-బోయపాటి కాంబో ఈసారి బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేస్తుందో చూడాలి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button